Mamangam trailer : ఒక్కబొట్టు కన్నీరు కార్చినా ప్రళయం అవుతుందంటున్న మామాంగం...
మమ్ముట్టి హీరోగా వస్తున్న చారిత్రక చిత్రం 'మామాంగం'. మామాంగం అంటే మహోత్సవం అని అర్థం.
మమ్ముట్టి హీరోగా వస్తున్న చారిత్రక చిత్రం 'మామాంగం'. మామాంగం అంటే మహోత్సవం అని అర్థం. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. జమోరిన్ పాలనలో చావెరుక్కళ్ యుద్ధవీరుల చరిత్ర ఆధారంగా రూపొందిన హిస్టారికల్ మూవీలో ఎన్నడూ చూడని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు మమ్ముట్టి. అతి ప్రాచీనమైన కలరి విద్యలోని విశిష్టతను ఇంతకు ముందు ఎవరూ చూపించినంతగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో కావ్య ఫిల్మ్ కంపెనీ పతాకంపై వేణు కున్నపిళ్లి ఈ చిత్రాన్ని నిర్మించారు.