ఎస్ఆర్ కల్యాణమండపం మేకింగ్ : నటనలో వాళ్లే నా టార్గెట్.. కిరణ్ అబ్బవరపు

రాజావారు రాణి గారు సినిమాతో  హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం తాజా సినిమా ఎస్ఆర్ కల్యాణమండపం. 

First Published Jul 15, 2020, 1:37 PM IST | Last Updated Jul 15, 2020, 1:37 PM IST

రాజావారు రాణి గారు సినిమాతో  హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం తాజా సినిమా ఎస్ఆర్ కల్యాణమండపం. ఈ రోజు కిరణ్ అబ్బవరపు పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. శ్రీధర్ గాదె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎలైట్ గ్రూప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు.  40 శాతం షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా లాక్‌డౌన్‌ వల్ల ఆగిపోయింది. ఈ సందర్బంగా కిరణ్ మాట్లాడుతూ ‘‘హీరోలు కృష్ణ, చిరంజీవిగార్లు ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోగలరు. వాళ్లలా మంచి నటుడనిపించుకోవాలనుకుంటున్నాను. ఏ పాత్ర అయినా పోషించగలననే పేరు తెచ్చుకోవడమే నా లక్ష్యం’’ అన్నారు కిరణ్‌.