ఈ దర్శకులంతా బాహుబలులే.. సినిమాను ఏళ్ల తరబడి చెక్కుతారు..

తెలుగులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉన్న దర్శకులు ఎవ్వరంటే ఠక్కున చెప్పే పేరు రాజమౌళి. 

First Published Aug 24, 2020, 5:52 PM IST | Last Updated Aug 24, 2020, 5:52 PM IST

తెలుగులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉన్న దర్శకులు ఎవ్వరంటే ఠక్కున చెప్పే పేరు రాజమౌళి. ఆయన్ని అందరూ ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటారు. కారణం ఆయన సినిమాకు తీసుకునే టైమే. ఒక్కో సినిమాకు కనీసం రెండు, మూడేళ్లు తప్పనిసరి. మొదటి సినిమా స్టూడెంట్ నెం.1 నుండి ఇప్పటివరకు చేసినని12 సినిమాలే. కాకాపోతే అన్నీ సక్సెసే. ఫెయిల్యూరంటూ లేని డైరెక్టర్. బాహుబలి ది కంక్లూజన్ వచ్చి మూడేళ్లవుతున్నా మరో సినిమా రిలీజ్ కాలేదు. 2019లో ప్రారంభించిన త్రిబుల్ ఆర్ పూర్తి కాకవడానికి ఇంకా సంవత్సరమైనా పట్టేలా ఉంది. ఆయనకు క్రేజ్ కూడా అలాగే ఉంది. ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడాయన.