నిర్మాత బన్నీ వాసు వేధింపుల వల్లే అర్ధనగ్న నిరసన... పుట్టినరోజు వీడియోలో యువతి
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు మహిళా ఆర్టిస్ట్ అర్ధనగ్నంగా హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు మహిళా ఆర్టిస్ట్ అర్ధనగ్నంగా హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అలా ఎందుకు చేయాల్సివచ్చిందో వివరిస్తూ తాజాగా యువతి ఓ వీడియో విడుదల చేసింది. నిర్మాత బన్నీ వస్ వేధింపుల కారుణంగా అర్ధనగ్నంగా నిరసన తెలియచేసానని తెలిపారు. ఇదివరకే బన్నీ వాసు వేధింపులు తట్టుకోలేక 5 సార్లు ఆత్మహత్యయత్నం చేసుకున్నానని సదరు మహిళ తెలిపారు. గీతా ఆర్ట్స్, అల్లు ఎంటటైన్ మెంట్ వారు తనకు సినిమాలు, సీరియల్ అవకాశం రాకుండా చేసారని ఆవేదన వ్యక్తం చేసారు. బన్నీ వాసు తనను అల్లు అరవింద్ పేరు చెప్పి బెదిరించాడని ఆరోపించారు. అందువల్లే అర్ధనగ్నంగా ఆందోళనకు దిగినట్లు యువతి వెల్లడించింది.