తండ్రిగా గర్వపడుతున్నా.. `ఆర్‌ఆర్‌ఆర్`కి ఆస్కార్‌పై రాజమౌళి ఫాదర్ విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యలు
`ఆర్‌ఆర్‌ఆర్` సినిమా చరిత్ర సృష్టించింది. తొబ్బై ఏళ్ల కలని నిజం చేసింది. ఈ చిత్రంలోని `నాటు నాటు` పాటకి ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వరించిన విషయం తెలిసిందే.
`ఆర్‌ఆర్‌ఆర్` సినిమా చరిత్ర సృష్టించింది. తొబ్బై ఏళ్ల కలని నిజం చేసింది. ఈ చిత్రంలోని `నాటు నాటు` పాటకి ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యం సమకూర్చగా, రాహుల్ సిప్లిగంజ్, కాళ భైరవ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నృత్యాలు సమకూర్చారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ డాన్సులు చేశారు. ఈ అద్భుతమైన సాంగ్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఇప్పుడు ఆస్కార్‌ని తీసుకొచ్చింది. ఈ అత్యున్నత పురస్కారం సాకారం కావడంలో దర్శకధీరుడు రాజమౌళి ప్రధాన కారకులు. ఆయనతోపాటు ఆయన తండ్రి దిగ్గజ రైటర్ విజయేంద్రపసాద్ ముఖ్య కారకులు. ఆయన మదిలోనుంచి ఈ `ఆర్‌ఆర్‌ఆర్` పుట్టిన నేపథ్యంలో ఆస్కార్ వచ్చిన సందర్భంగా రైటర్ విజయేంద్రప్రసాద్ తన ఆనందాన్ని పంచుకున్నారు. గర్వంగా ఉందన్నారు.