సోనూ సూద్ కు ఛాలెంజ్ విసిరిన శ్రీనువైట్ల..
నిర్మాత, నటుడు బండ్ల గణేష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన శ్రీను వైట్ల హైదరాబాద్, జర్నలిస్ట్ కాలనీలోని తన నివాసంలో మొక్కలు నాటారు.
నిర్మాత, నటుడు బండ్ల గణేష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన శ్రీను వైట్ల హైదరాబాద్, జర్నలిస్ట్ కాలనీలోని తన నివాసంలో మొక్కలు నాటారు. తాను హైదరాబాద్ కి వచ్చి 30 యేళ్లయిందని ఇలాంటి కార్యక్రమం ఇంతకు ముందు చూడలేదని అన్నారు. ఈ ఛాలెంజ్ ప్రారంభించిన జోగినిపల్లి సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్, నటుడు సోనూ సూద్, హీరో విష్ణు మంచు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, టీఎస్ఎండీసీ ఎండీ మల్సూర్, ప్రముఖ రచయిత గోపి మోహన్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు నామినేట్ చేస్తున్నట్టు తెలియజేశారు.