భీమ్లా నాయక్ మూవీ పబ్లిక్ టాక్ : రికార్డులు రాసేవాళ్ళ పెన్నులు అరిగిపోతాయి ... ఫ్యాన్ క్రేజీ రివ్యూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి కలసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం ప్రేక్షకుల మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. 

First Published Feb 25, 2022, 11:13 AM IST | Last Updated Feb 25, 2022, 11:13 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి కలసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం ప్రేక్షకుల మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వంలో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేలో ఈ చిత్రం తెరకెక్కింది. మలయాళీ చిత్రం అయ్యప్పన్ కోషియంకి ఇది రీమేక్. పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ చిత్రం నేడు థియేటర్స్ లోకి వచ్చేసింది. యూఎస్ తో పాటు తెలంగాణలో కూడా ప్రీమియర్ షోలు మొదలయ్యాయి.  ఎక్కడ చూసిన థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది, అంచనాలను అందుకుందో లేదో ఈ పబ్లిక్ టాక్ లో చూడండి..!