Akhanda:విజయవాడ దుర్గమ్మ, మంగళగిరి నరసన్నను దర్శించుకున్న నందమూరి బాలకృష్ణ
విజయవాడ: ఇటీవల విడుదలైన 'అఖండ' సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను ఇవాళ(బుధవారం) విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
విజయవాడ: ఇటీవల విడుదలైన 'అఖండ' సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను ఇవాళ(బుధవారం) విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అఖండ టీం కి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అఖండ టీంకు ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కూడా అఖండ సినిమా టీం దర్శించుకున్నారు. స్వామివారికి కూడా ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకి కృతజ్ఞతలు తెలిపారు. మంచి సినిమాను ప్రజలు ఆదరిస్తారని అఖండ విజయంతో మరోసారి నిరూపితమైందని బాలకృష్ణ అన్నారు.