సీఎం కేసీఆర్ దృడసంకల్పానికి నిదర్శనమే యాదాద్రి వైభవం...: హీరో బాలకృష్ణ
యాదగిరిగుట్ట: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిని సినీ హీరో, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందర్శించారు. హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో యాదగిరిగుట్టకు చేరుకున్న బాలయ్యను ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. అఖండ దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డితో కలిసి బాలకృష్ణ శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సర్వాంగ సుందరంగా నిర్మితమవుతున్న ఆలయ పరిసరాలను బాలయ్య పరిశీలించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో, దృఢ సంకల్పంతో భారత దేశంలోనే అందరూ స్వామివారిని దర్శించుకునేలా యాదాద్రిని రూపుదిద్దారని కొనియాడారు. యాదాద్రి ఆలయం ఒక చారిత్రాత్మకం... ఆలయ నిర్మాణంలో పనిచేసిన ప్రతీ ఒక్క కార్మికునికి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా, కొత్త వైరస్ మహమ్మారుల నుంచి ప్రజలను కాపాడాలని లక్ష్మీనరసింహ స్వామిని కోరుకున్నట్లు తెలిపారు