విజయవాడలో సినీ తార నివేదా పేతురాజ్ సందడి
కృష్ణా జిల్లా విజయవాడ పట్టణంలో సినీ హీరోయిన్ నివేదా పేతురాజ్ సందడి చేసారు.
కృష్ణా జిల్లా విజయవాడ పట్టణంలో సినీ హీరోయిన్ నివేదా పేతురాజ్ సందడి చేసారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఆలయ సిల్క్స్ టెక్స్ టైల్ షోరూం ఆమె బుధవారం ప్రారంభించారు. తమ పట్టణానికి విచ్చేసిన హీరోయిన్ నివేదాను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. నూతన వస్త్ర షోరూం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించినందుకు యాజమాన్యానికి హీరోయిన నివేదా ధన్యవాదాలు తెలిపారు.అందరికీ అందుబాటు ధరల్లో రూ. 51 రూపాయల నుంచి చీరలను అందుబాటులో ఉంచామని ఈ సందర్భంగా షోరూం యాజమాన్యం ప్రకటించింది. తమ వస్త్ర దుకాణాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి, ఆదరించాలని కోరుకుంటున్నామని యాజమాన్యం పేర్కొంది.