Asianet News TeluguAsianet News Telugu

అనారోగ్యంతో వేదం నాగయ్య మృతి..సినీ ప్రముఖులు సంతాపం

ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్టు, కష్టాలకు కేరాఫ్‌గా నిలిచే పాత్రల్లో మెప్పించిన `వేదం` నాగయ్య శనివారం కన్నుమూశారు. 

ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్టు, కష్టాలకు కేరాఫ్‌గా నిలిచే పాత్రల్లో మెప్పించిన `వేదం` నాగయ్య శనివారం కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు. కష్టాలు అనుభవించే పెద్ద మనిషి పాత్రల్లో, రైతు తరహా పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్న `వేదం` నాగయ్య దాదాపు మూడు పదుల సినిమాల్లో నటించి మెప్పించాడు.  `వేదం` సినిమాలోని..`నేసేవాడినంటున్నావు కాస్త మంచి బట్టలు కట్టుకొని రావొచ్చు కదా అంటే ఇళ్లు కట్టేవాడికి ఇళ్లుండదు, చెప్పులు కుట్టేవాడికి చెప్పులుండవు.. మాపరిస్థితి కూడా అంతే` అంటూ చెప్పిన డైలాగ్‌తో పాపులర్‌ అయ్యారు వేదంనాగయ్య.