Asianet News TeluguAsianet News Telugu

మరోసారి పూరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండ్ల...నాకు కామెంట్స్ చేసే రైట్ ఉంది అంటూ...

పూరి తనయుడు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ పూరి జగన్నాధ్ పై డైరెక్ట్ గా అటాక్ చేశారు. 

పూరి తనయుడు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ పూరి జగన్నాధ్ పై డైరెక్ట్ గా అటాక్ చేశారు. సొంత కొడుకుని పట్టించుకోకుండా ఎవరెవరినో సూపర్ స్టార్స్ చేస్తావు ఏంటి అన్నా అంటూ బండ్ల గణేష్ పూరిని విమర్శించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పూరి జగన్నాధ్ పరోక్షంగా బండ్ల కామెంట్స్ కి కౌంటర్ ఇవ్వడం చూశాం. నాలుక జాగ్రత్తగా ఉంచుకోవాలని పూరి హెచ్చరించారు. తాజాగా మరోసారి బండ్ల గణేష్ పూరి పై షాకింగ్ కామెంట్స్ చేశారు. బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అక్కడ పూరి జగన్నాధ్ గురించి ప్రస్తావన వచ్చింది.