Asianet News TeluguAsianet News Telugu

మంత్రి కేటీఆర్ కు యాక్టర్ అలీ స్పెషల్ భర్త్ డే గిప్ట్... ఆ హీరోకు ఛాలెంజ్ విసిరిమరీ..!

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినీనటుడు అలీ మొక్క నాటారు. 

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినీనటుడు అలీ మొక్క నాటారు. అమీర్ పేటలోని సారధి స్టూడియో మొక్కనాటిన అలీ కేటీఆర్ కు భర్త్ డే విషెస్ తెలిపారు. కేటీఆర్ పుట్టినరోజున ఎంపీ సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందాన్నిందని అలీ అన్నారు. ప్రతిఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటాలని... అప్పుడే భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఆక్సిజన్ అందుతుందన్నారు. కాబట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గోని మొక్కలు నాటడమే కాదు మరికొందరు నాటేలా చూడాలన్నారు. తాను హీరో శ్రీకాంత్, ఉమ, ఉత్తేజ్ లకు మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.