టీఎస్ పిఎస్సి పేపర్ లీక్ తో సంబంధం లేదా చిన్న దొర?:కేటీఆర్ కు షర్మిల సూటిప్రశ్న
హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్ పిఎస్సి) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో తనకేం సంబంధం అంటున్న ఐటీ మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్ టిపి చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు.
హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్ పిఎస్సి) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో తనకేం సంబంధం అంటున్న ఐటీ మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్ టిపి చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు.
పేపర్ లీక్ అయితే మీకు సంబంధం లేదా చిన్న దొర? గతంలో పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది మీరు కాదా? అని ప్రశ్నించారు. లక్షలాది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమేనా పారదర్శకత... అంగట్లో సరుక్కుల్లా పేపర్లు అమ్ముకోవడమేనా పారదర్శకత అని ప్రశ్నించారు. ఎక్కడో కంప్యూటర్ హ్యాక్ అయితే నాకేం సంబంధం అంటున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్... ఐటీ మంత్రిగా ప్రశ్నపత్రాలను సీక్రెట్ గా వుంచాల్సిన బాధ్యత మీదేనని గుర్తించాలన్నారు. ఇలాంటిది టీఎస్ పిఎస్సి కి మించిన సంస్థే లేదన్నట్లు కేటీఆర్ వెనకేసుకు రావడం దారుణమని షర్మిల మండిపడ్డారు.