శనిగ్రహాన్ని మించిన దశమగ్రహం చంద్రబాబు... తస్మాత్ జాగ్రత్త : కొడాలి నాని ఫైర్
గుడివాడ : చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలి అవుతున్నారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు.
గుడివాడ : చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలి అవుతున్నారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. ఏడాది చివర్లో కందుకూరులో ఎనిమిది మంది, ఈ ఏడాది ఆరంభంలో మరో ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాడని అన్నారు. గుంటూరు సభలో సామాన్య మహిళలు చనిపోవడానికి కారణం చంద్రబాబేనని... కానుకలిస్తామని ఆశచూపి బలితీసుకున్నారని ఆరోపించారు. ఇకపై చంద్రబాబు బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకూడదని కొడాలి నాని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు.
చంద్రబాబు శనిగ్రహాన్ని మించిన దశమగ్రహమంటూ నాని మండిపడ్డారు. యమరథంతో మనుషుల ప్రాణాలు తీస్తున్నాడని మండిపడ్డారు. టీడీపీ నేతలు తమ నేరాన్ని పోలీసులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు.