గడపగడపకు మన ప్రభుత్వం... మాజీ మంత్రి అనిల్ కు పసుపు నీళ్ళతో హారతిపట్టి, దిష్టితీసిన మహిళలు
నెల్లూరు: ఎన్నికలకు మరో రెండేళ్ల సమయంలో వున్నప్పటికీ పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు వైఎస్సార్ సిపి అధినేత వైఎస్ జగన్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు
నెల్లూరు: ఎన్నికలకు మరో రెండేళ్ల సమయంలో వున్నప్పటికీ పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు వైఎస్సార్ సిపి అధినేత వైఎస్ జగన్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. తనతో సహా వైసిపి ప్రజాప్రతినిధులంతా నిత్యం ప్రజల్లో వుండాలని... ఇందుకోసం ప్రత్యేకంగా గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందులోభాగంగానే నెల్లూరు నగరంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా నెల్లూరులోని 50వ డివిజన్ లో పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే అనిల్ కు మహిళలు సాదరస్వాగతం పలికారు. పసుపు నీళ్ళతో హారతిచ్చి, కొబ్బరికాయతో దిష్టితీసి అనిల్ పై అభిమానాన్ని చాటుకున్నారు మహిళలు. ఈ సందర్భంగా గల్లీల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్న అనిల్ ను చూసి ఓ చిన్నారి ఆటో గ్రాఫ్ తీసుకుంది. ఇలా నెల్లూరులో ఎమ్మెల్యే అనిల్ కు అడుగడుగున ఆత్మీయ అభిమానం లభించింది.