న్యాయ రాజధానిగా కర్నూలు.. జగన్ చిత్రపటానికిపాలాభిషేకం చేసిన నేతలు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి బిల్లు-2020, ఏపీ సీఆర్‌డీఏ రద్దు బిల్లు-2020లకు రాష్ట్ర గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం పలికారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి బిల్లు-2020, ఏపీ సీఆర్‌డీఏ రద్దు బిల్లు-2020లకు రాష్ట్ర గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం పలికారు. దీంతో కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద వైసీపీ నేతల సంబరాలు చేసుకున్నారు. కర్నూలును న్యాయ రాజధానిగా ఆమోదించిన నేపథ్యంలో తెలుగు తల్లి విగ్రహం ముందు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు