మట్టి కోసం కొట్టుకున్న వైసిపి నాయకులు... మైలవరంలో ఉద్రిక్తత
మైలవరం : మట్టి తరలింపు విషయంలో అధికార పార్టీ నేతల మధ్య తలెత్తిన వివాదం చివరకు రెండు వర్గాలమధ్య ఘర్షణకు దారితీసింది.
మైలవరం : మట్టి తరలింపు విషయంలో అధికార పార్టీ నేతల మధ్య తలెత్తిన వివాదం చివరకు రెండు వర్గాలమధ్య ఘర్షణకు దారితీసింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామంలో వైసిపి నేత నాంభూపాల్ రెడ్డి పొలాల్లోంచి మట్టిని ఇసుకబట్టీలకు తరలించే ప్రయత్నం చేయగా సొసైటీ అధ్యక్షుడు తోట తిరుపతిరావు వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి పరస్పర దాడులకు దిగారు. ఈ దాడిలో తిరుపతిరావుతో పాటు మరొకరు గాయపడ్డారు. ఈ ఘర్షణపై సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై రాంబాబు సిబ్బందితో కలిసి వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు సీజ్ చేసారు.