వివేకా హత్యకేసులో ఎంతటివారున్నా తప్పించుకోలేరు...: జగన్ బావ అనిల్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ బావ, ప్రముఖ క్రైస్తవ మతబోధకులు బ్రదర్ అనిల్ కుమార్ విశాఖపట్నంలో క్రైస్తవ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. 

First Published Mar 14, 2022, 4:34 PM IST | Last Updated Mar 14, 2022, 4:49 PM IST

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ బావ, ప్రముఖ క్రైస్తవ మతబోధకులు బ్రదర్ అనిల్ కుమార్ విశాఖపట్నంలో క్రైస్తవ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్  మీడియాతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంపైనే కాకుండా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపైనా సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల ముందు తనను నమ్మి వివిధ సంఘాలు వైసిపి ప్రభుత్వ ఏర్పాటు కృషి చేసారని....ఇప్పుడు వారు బాధలో ఉంటే స్పందించాల్సిన బాధ్యత తనకు వుందన్నారు. క్రైస్తవ సంఘాలకు అన్యాయం జరిగింది... వాళ్ళు ఒక ప్రత్యామ్నాయా పార్టీ పెట్టాలి... బిసికి సీఎం పదవి ఇవ్వాలని అంటున్నారని... కానీ పార్టీ పెట్టడమంటే సాధారణ విషయం కాదన్నారు. 
 
ఇక వైవస్ వివేకా దారుణ హత్యపై బ్రదర్ అనిల్ స్పందిస్తూ దోషులు ఎంతటివారయినా తప్పించుకోలేరని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఈ హత్య కేసును విచారిస్తోందంటే చిన్న విషయం కాదన్నారు. విచారణలో నిజాలు బయటపడతాయనిబ్రదర్ అనిల్ పేర్కొన్నారు.