ఇళ్ల స్థలాల కేటాయింపులో అన్యాయం.. వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకులు..
కృష్ణాజిల్లాలో అర్హులైన వారికి ఇండ్ల స్థలాల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని నిరసనలు వెల్లువెత్తున్నాయి.
కృష్ణాజిల్లాలో అర్హులైన వారికి ఇండ్ల స్థలాల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని నిరసనలు వెల్లువెత్తున్నాయి. తాజాగా కంకిపాడు మండలం ప్రొద్దుటూరులో కొంతమంది యువకులు పెట్రోల్ బాటిళ్లు పట్టుకుని వ్యాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. తమకు ఇళ్ల స్థలాల విషయంలో అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వీరిని కిందికి దించే ప్రయత్నాలు చేస్తున్నారు.