చంద్రగిరిలో పోలీసుల దాష్టికం... ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుడినే లాఠీతో కుల్లబొడిచిన ఎస్సై
చంద్రగిరి: బైక్ పోయిందని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితుడినే పోలీసులు ప్రతాపం చూపించారు. ఎస్సై బూతులు తిడుతూ లాఠీతో చితకబాదినట్లు బాధితుడు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని చంద్రగిరి పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. చంద్రగిరి మండలంలోని పట్టాభిరారామాపురానికి చెందిన బాధితుడికి అదే గ్రామానికి చెందిన హోంగార్డుకు వ్యక్తిగత గొడవలున్నాయి. ఈ నేపథ్యంలోనే బైక్ పోయిందని ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుడిని ఎస్సైతో చేత చితకొట్టించాడు హోంగార్డు. కాళ్లు పట్టుకుని బ్రతిమాలినా వినకుండా బూతులు తిడుతూ ఎస్సై లాఠీతో కుళ్లబొడిచాడని బాధితుడు తెలిపాడు. తనపై జరిగిన అమానుష దాడిపై సీఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వెల్లడించాడు.