నరసరావుపేటలో దారుణం...మద్యంమత్తులో స్నేహితుల ఘర్షణ, ఒకరు మృతి
పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం జరిగింది. ద్విచక్ర వాహనం విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య వివాదం చెలరేగి ఒకరి హత్యకు దారితీసింది. మద్యం మత్తులో గొడవ జరగడంతో విచక్షణ కోల్పోయిన యువకుడు స్నేహితులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. నరసరావుపేటలోని ఒకే ప్రాంతంలో నివాసముండే పోలిచర్ల అఖిల్, శివాపరపు అఖిల్ మంచి స్నేహితులు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం జరిగింది. ద్విచక్ర వాహనం విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య వివాదం చెలరేగి ఒకరి హత్యకు దారితీసింది. మద్యం మత్తులో గొడవ జరగడంతో విచక్షణ కోల్పోయిన యువకుడు స్నేహితులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. నరసరావుపేటలోని ఒకే ప్రాంతంలో నివాసముండే పోలిచర్ల అఖిల్, శివాపరపు అఖిల్ మంచి స్నేహితులు. ఈ ఇద్దరూ మరికొందరు స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో బైక్ విషయంలో ఇద్దరు అఖిల్ ల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. మిగతా స్నేహితులంతా శివాపరపు అఖిల్ కు మద్దతుగా నిలిచి పోలిచెర్ల అఖిల్ పై విచక్షణారహితంగా దాడి చేసారు. దీంతో తీవ్ర గాయాలపాలైన అతడు స్థానికంగా వున్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో అతడి కుటుంబసభ్యులు ఆగ్రహంతో మృతదేహంతో రోడ్డుపై భైఠాయించి ఆందోళనకు దిగారు. హత్యకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చెసి కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.