విశాఖలో రెండు కోట్ల మొక్కలు.. ఉష్ణోగ్రతలు తగ్గించే ప్రయత్నం.. విజయసాయి రెడ్డి..
విశాఖబీచ్ లో సన్ రే రిసార్ట్స్ సౌజన్యంతో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, మ౦త్రి అవ౦తి శ్రీనివాస్ లు నౌపాక మెుక్కలు నాటారు.
విశాఖబీచ్ లో సన్ రే రిసార్ట్స్ సౌజన్యంతో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, మ౦త్రి అవ౦తి శ్రీనివాస్ లు నౌపాక మెుక్కలు నాటారు. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలను పెంచాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. నౌపాక మొక్కలలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయని, నౌపాక మొక్కలను బీచ్ లో నాటడం ఆనందంగా ఉందని, విశాఖలో ఉష్ణోగ్రతను తగ్గించే విధంగా మొక్కలు దోహద పడతాయని విజయ్ సాయిరెడ్డి అన్నారు.విశాఖలో 2 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించామని తెలిపారు.