సొంత నియోజకవర్గంలోకే వైసిపి మహిళా ఎమ్మెల్యేకు నిరసన సెగ

అమరావతి: వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సొంత నియోజకవర్గ మహిళల నుండే నిరసన సెగ తగిలింది.

First Published Mar 18, 2022, 9:52 AM IST | Last Updated Mar 18, 2022, 9:52 AM IST

అమరావతి: వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సొంత నియోజకవర్గ మహిళల నుండే నిరసన సెగ తగిలింది. తుళ్లూరు మండలం అనంతపురం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణంలో ఎమ్మెల్యే పాల్గొని పట్టువస్త్రాలు స్వామివారికి సమర్పించారు. ఈ దైవకార్యంలో రాజధాని ప్రాంత ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవిని చూసి ఆగ్రహించిన కొందరు రాజధాని మహిళలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.