ముందు మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. ఆ తర్వాతే సవాల్.. గుడివాడ అమర్నాథ్
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడరే వెన్నుపోటు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చంద్రబాబును ఎద్దేవా చేశారు
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడరే వెన్నుపోటు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చంద్రబాబును ఎద్దేవా చేశారు. జగన్ కు సవాల్ విసిరేముందు మీ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని తిరిగి చంద్రబాబుకు సవాల్ విసిరాడు. ప్రజలపై ప్రేమతో కాదు రాజధానిలో మీకున్న భూములు విలువలు తగ్గిపోతాయన్న బాధతోనే చంద్రబాబు అలా మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుకు రియల్ ఎస్టేట్ కావాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి స్టేట్ కావాలి అని చంద్రబాబుకు చురక అంటించారు. రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం అన్నారు