ఏపీలో కరోనా కలకలం... వైసిపి ఎమ్మెల్యే అంబటికి రెండోసారి కరోనా పాజిటివ్
గుంటూరు: సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు (Ambati Rambabu) రెండోసారి కరోనా బారినపడ్డారు.
గుంటూరు: సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు (Ambati Rambabu) రెండోసారి కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. తాను క్వారంటైన్‌లో ఉంటున్నట్టుగా చెప్పారు. జలుబు, ఒళ్లు నొప్పులు ఉండటంతో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు ఆయన తెలిపారు. తాను క్వారంటైన్ లోకి వెళుతున్నా... ఎవరూ డిస్టర్బ్ చేయవద్దని అంబటి వైసిపి శ్రేణులు, అనుచరులకు పిలుపునిచ్చారు.