ఏపీలో దారుణం.. టిడిపి నేత ఇంటిపై దాడి చేసిన వైసీపీ నేతలు..

కర్నూలు జిల్లా డోన్ లో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టిడిపి నాయకుడు టిఈ కేసన్న గౌడ్ ఇంటిపై వైసిపి నాయకులు దాడికి పాల్పడ్డారు. 

First Published Jul 8, 2020, 10:22 AM IST | Last Updated Jul 8, 2020, 10:22 AM IST

కర్నూలు జిల్లా డోన్ లో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టిడిపి నాయకుడు టిఈ కేసన్న గౌడ్ ఇంటిపై వైసిపి నాయకులు దాడికి పాల్పడ్డారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు నగరంలోని కొండపేటలో ఉన్న కేసన్న గౌడ్ ఇంట్లోకి నలుగురు వైసిపి నాయకులు దౌర్జన్యంగా ప్రవేశించి బీభత్సం సృష్టించారు. వైసిపి నాయకులు ఓబులాపురం సుధాకర్ యాదవ్, రమణ యాదవ్ తో పాటు మరి కొంతమంది  ఇంటి మీదకి వెళ్ళారు. ఆఫీస్ రూమ్ లో నిద్రిస్తున్న కేసన్న గౌడ్ తండ్రి రామకృష్ణ గౌడ్ ను కాలితో తన్ని దాడి చేశారు. నీ కొడుకును చంపుతామని బెదిరించారని రామకృష్ణ గౌడ్ పోలీసులకు తెలిపారు. ఇంట్లో ఉన్న కేశన తల్లి కేకలు వేసుకుంటూ రావడంతో తన మీదికి కట్టే విసిరారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టిడిపి నాయకులు. పోలీసులు కేసన్న ఇంటికి చేరుకుని సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా వైసిపి నాయకులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ దాడికి కారణం పాత కక్ష లే అని తెలుస్తుంది.