విశాఖలో కలకలం.. పట్టపగలు వైసీపీ నేత కిడ్నాప్..
విశాఖ ద్వారకా నగర్ లో నడిరోడ్డుపై వైసీపి నేత కిడ్నాప్ జరిగింది.
విశాఖ ద్వారకా నగర్ లో నడిరోడ్డుపై వైసీపి నేత కిడ్నాప్ జరిగింది. ద్వారకానగర్ లో రోడ్డుమీద వెడుతున్న వైసీపి నేత లాళం అప్పలరాజును ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. వారినుండి
తప్పించుకున్న అప్పలరాజు విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. మంకీ క్యాప్ లు వేసుకుని వచ్చి తనను లాక్కెళ్లారని చెబుతున్నాడు.