మా గ్రామంలో ధర్నా ఎందుకు... వినుకొండ మాజీ ఎమ్మెల్యేను నిలదీసిన సర్పంచ్
గుంటూరు: ధాన్యం కొనుగోలు విషయంలో ఆందోళనకు దిగిన మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులుతో గ్రామ సర్పంచ్ వాగ్వాదానికి దిగిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
గుంటూరు: ధాన్యం కొనుగోలు విషయంలో ఆందోళనకు దిగిన మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులుతో గ్రామ సర్పంచ్ వాగ్వాదానికి దిగిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. రైతుల వద్ద నుండి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటివరకూ డబ్బులు చెల్లించలేదంటూ ఈపూరు మండలం కోచెర్ల గ్రామంలోని ఆర్బికే వద్ద టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు. ఇది తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కోపెల దేవరాజ్ ధర్నాస్థలి వద్దకు చేరుకొని ప్రభుత్వం తమ గ్రామంలో ఏ రైతుకు ధాన్యం డబ్బు ఇవ్వలేదో చూపించాలని నీలదీసాడు. కేవలం కోచెర్లలో కాదు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించాలని ఈ ఆందోళన చేపడుతున్నట్లు ఆంజనేయులు తెలిపారు. అలాంటప్పుడు తమ గ్రామంలో ఎందుకు ధర్నా ఎందుకు చేస్తున్నారని సర్పంచ్ నిలదీసాడు. ఇలా మాజీ ఎమ్మెల్యే, సర్పంచ్ మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. ప్రభుత్వం ఇలాంటి తప్పుడు ప్రచారాలు సరైనది కాదంటూ టిడిపి నాయకుల ధర్నాను సర్పంచ్ ఖండించారు.