రేపల్లెలో అమానుషం... కట్టుకున్న భర్త, కన్నబిడ్డల కళ్లముందే మహిళపై గ్యాంగ్ రేప్
బాపట్ల: ఆంధ్ర ప్రదేశ్ లో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.
బాపట్ల: ఆంధ్ర ప్రదేశ్ లో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. రోడ్లు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు ఎక్కడా మహిళలను రక్షణ లభించడంలేదు. ఇటీవల గురజాల రైల్వే స్టేషన్లో ఒడిషాకు చెందిన వివాహితను మూడేళ్ళ కొడుకు ముందే కొందరు మృగాళ్లు గ్యాంగ్ రేప్ పాల్పడిన ఘటన మరువకముందే తాజాగా బాపట్ల జిల్లా రేపల్లెలో మరో ఘోరం వెలుగుచూసింది.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపురం గ్రామానికి చెందిన దంపతులపై రేపల్లె రైల్వే స్టేషన్ లో కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. నిర్మానుష్యంగా వున్న ప్లాట్ ఫారంపై ముగ్గురు పిల్లలు, భర్తతో వున్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ భర్తను చితకబాది ముగ్గురు బిడ్డల కళ్లముందే ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ అమానుష ఘటనపై స్పందిస్తూ రేపల్లె టిడిపి ఆందోళన చేపట్టింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ఈ దారుణానికి పాల్పడ్డ దుండగులను కఠినంగా శిక్షించాలని టిడిపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.