గన్నవరం సచివాలయ ఉద్యోగి పాడుపని ... చెప్పులు, చీపుర్లతో చితకబాదిన మహిళలు

గన్నవరం : వాలంటీర్ గా పనిచేస్తున్న యువతి పెళ్లి చెడగొట్టిన ఓ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మహిళల చేతిలో చెప్పులు, చీపుర్లతో దెబ్బలు తిన్నాడు.

First Published Feb 26, 2023, 9:42 AM IST | Last Updated Feb 26, 2023, 9:42 AM IST

గన్నవరం : వాలంటీర్ గా పనిచేస్తున్న యువతి పెళ్లి చెడగొట్టిన ఓ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మహిళల చేతిలో చెప్పులు, చీపుర్లతో దెబ్బలు తిన్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో చోటుచేసుకుంది. 

గన్నవరం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేసే రాంబాబు అక్కడే వాలంటీర్ గా పనిచేసే యువతిపై కన్నేసాడు. అయితే ఆమెకు మరో యువకుడితో పెళ్లి కుదరడంతో ఎలాగయినా దీన్ని ఆపాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి జరిగే రోజు (ఫిబ్రవరి 22న) పెళ్లికొడుకును కలిసిన రాంబాబు పెళ్లికూతురు గురించి నీచంగా చెప్పాడు. యువతి తోటి ఉద్యోగి చెబుతున్నాడు కాబట్టి నిజమేనని నమ్మిన పెళ్లికొడుకు హఠాత్తుగా పెళ్లిని ఆపాడు. తాజాగా పెళ్ళి ఆగిపోడానికి రాంబాబే కారణమని తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు, బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. పెళ్ళిపీటల వరకు వచ్చిన తమ బిడ్డ పెళ్లిన ఆపిన రాంబాబును పట్టుకుని చెప్పులు, చీపుర్లతో దాడికి పాల్పడ్డారు.