బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి... మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత
కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో బాలింత మృతి ఉద్రిక్తతకు దారితీసింది.
కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో బాలింత మృతి ఉద్రిక్తతకు దారితీసింది. ఉయ్యూరుకు చెందిన నిండు గర్భిణి నాగమణిని(23) కుటుంబసభ్యులు ప్రసవం కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. మగబిడ్డుకు జన్మనిచ్చిన 24 గంటల తర్వాత నాగమణి పరిస్థితి విషమించి మృతిచెందింది. అయితే ఆమె మృతికి హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి వద్ద కొంతసేపు గందరగోళం నెలకొంది.