సంక్రాంతి పండగపూట దారుణం... ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

మంగళగిరి : సంక్రాంతి పండగపూట కుటుంబంతో సంబరాలు చేసుకోవాల్సింది పోయి ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో కసాయి మహిళ. 

First Published Jan 15, 2023, 11:30 AM IST | Last Updated Jan 15, 2023, 11:30 AM IST

మంగళగిరి : సంక్రాంతి పండగపూట కుటుంబంతో సంబరాలు చేసుకోవాల్సింది పోయి ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో కసాయి మహిళ. తన వివాహేతర సంబంధం గురించి తెలియడంతో   భర్త అడ్డు తొలగించుకోవాలని కుట్రపన్నిన వివాహిత ప్రియుడితో కలిసి ఆ దారుణానికి ఒడిగట్టింది. ఈ అమానుష ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

మంగళగిరి పట్టణంలోని గాలిగపురం సమీపంలోని వింజమూరి క్రాంతి కుమార్(35), గంగలక్ష్మి దంపతులు నివాసముండేవారు. వారి ఇంటి సమీపంలోనే వుండే చిన్నా అనే యువకుడితో గంగలక్ష్మికి పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో అతడి అడ్డు తొలగించుకుని ప్రియుడితోనే శాశ్వతంగా వుండిపోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ప్రియుడు చిన్నతో పాటు సురేష్ అనే మరో వ్యక్తి సాయంతో ఇంట్లోనే భర్తపై దాడిచేసి చంపేసింది.