విశాఖలో మరో పేలుడు.. విజయశ్రీ ఫార్మా కంపెనీలో ప్రమాదం..
విశాఖ జిల్లా రాంబిల్లి మండలం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది.
విశాఖ జిల్లా రాంబిల్లి మండలం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి మంటలు ఎగిసిపడుతుండడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. పేలుడు ధాటికి రెండు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. కంపెనీకి సమీపంలోనే అగ్నిమాపక యంత్రం ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. సకాలంలో మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది.