200వ రోజుకు విశాఖ ఉక్కు ఉద్యమం... 10కిలోమీటర్ల భారీ మానవహారం
విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో కార్మికులు చేపట్టిన ఉద్యమం నేటికి(ఆదివారం) 200వ రోజుకు చేరుకుంది.
విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో కార్మికులు చేపట్టిన ఉద్యమం నేటికి(ఆదివారం) 200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో 10కిలోమీటర్ల భారీ మానవహారాన్నిఏర్పాటుచేసిన నిరసన తెలిపారు. అగనంపూడి నుండి అక్కిరెడ్డిపాలెం వరకు వేలాదిగా కార్మికులు, మహిళలు మానవహారం చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.