Asianet News TeluguAsianet News Telugu

వైజాగ్ గ్యాస్ ట్రాజెడీ : ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు షాక్.. (చూడండి)

విశాఖ ఎల్జీ పాలిమర్స్ వద్దకు వచ్చిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

విశాఖ ఎల్జీ పాలిమర్స్ వద్దకు వచ్చిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కంపెనీ గేట్లు దూకి లోపలకు వెళ్లిన స్థానికులు డీజీపీని అడ్డుకున్నారు. దీంతో ప్రత్యేక రక్షణ వలయంలో వారిని బయటకు తీసుకొచ్చారు. కంపెనీ గేటు లోపలే ఉండిపోయిన డీజీపీ అక్కడే మీడియాతో మాట్లాడారు. స్థానికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. గ్యాస్ లీక్ ఘటనపై వివరాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ నుంచి నిపుణులు వస్తున్నారన్నారు డీజీపీ. నిపుణుల సూచన మేరకే తర్వాత చర్యలు ఉంటాయన్నారు.