Asianet News TeluguAsianet News Telugu

జీవో నెం.3 కి చట్టబద్ధత కల్పించాలంటూ.. ఆదివాసీ సంఘాల బంద్..

విశాఖ ఏజెన్సీ, చింతపల్లిలో జీవో నెం3 రద్దుకు నిరసనగా గిరిజనసంఘాలు, ఉపాధ్యాయ ఉద్యోగసంఘాలు 48గంటల నిరవధిక మన్యం బంద్ నేటినుంచి ప్రారంభమయ్యింది. 

విశాఖ ఏజెన్సీ, చింతపల్లిలో జీవో నెం3 రద్దుకు నిరసనగా గిరిజనసంఘాలు, ఉపాధ్యాయ ఉద్యోగసంఘాలు 48గంటల నిరవధిక మన్యం బంద్ నేటినుంచి ప్రారంభమయ్యింది. కాగా జీవో నెం3 పునరిద్దిచే వరకు పోరాటం కొనసాగిస్తామని గిరిజననేతలు చెబుతున్నారు. అయితే జీవో నెం3 రద్దుకు నిరసనగా ఈరోజు తెల్లవారుజాము 5గం.ల నుంచే విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం, జీకేవీధి మండలం, కొయ్యురుమండలాల్లో బంద్ ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు గిరిజన సలహామండలితో చర్చించి, ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసేలా తీర్మానం చేయాలని, అసెంబ్లీ లో చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ బంద్ ను కొనసాగిస్తున్నారు.