మరో వైసిపి ఎమ్మెల్యే చేదు అనుభవం... రోడ్డు కోసం రోడ్డుపైనే నిలదీసిన గ్రామస్తులు
తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని చేపట్టిన వైసిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు చేదు అనుభవం ఎదురయ్యింది.
తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని చేపట్టిన వైసిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు చేదు అనుభవం ఎదురయ్యింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజవకర్గంలోని బీఎన్ కండ్రిగ మండలం కనమనంబేడు గ్రామంలో ఇవాళ ఎమ్మెల్యే పర్యటించారు. ఈ క్రమంలోనే తమ గ్రామ సమస్యలపై స్థానికులు ఎమ్మెల్యేను నిలదీసారు. రహదారి నిర్మాణాన్ని పూర్తిచేయాలంటూ ఎమ్మెల్యే ఆదిమూలంను గ్రామస్థులు అడ్డుకున్నారు.