యేళ్ల తరువాత నిండిన చెరువు.. అంతలోనే అనుకోని ఉపద్రవం..

తుగ్గలి మండల పరిధిలోని బొందిమడుగుల గ్రామంలోని చెరువుకు గండి పడటంతో నీళ్లన్నీ వృధాగా పోతున్నాయి.

First Published Jul 22, 2020, 4:39 PM IST | Last Updated Jul 22, 2020, 4:39 PM IST

తుగ్గలి మండల పరిధిలోని బొందిమడుగుల గ్రామంలోని చెరువుకు గండి పడటంతో నీళ్లన్నీ వృధాగా పోతున్నాయి. ఈ విషయంపై మైనర్ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించడం లేదని అందువల్ల జిల్లా కలెక్టర్ తక్షణమే మైనర్ ఇరిగేషన్ అధికారులను సస్పెండ్ చేయాలని  రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత చెరువులోకి వర్షం నీరు వచ్చిందని రైతులంతా సంతోషంగా ఉన్నారని, చెరువు కి గండి పడటంతో నీళ్లన్నీ వృధాగా పోతున్నాయని  ఆందోళన చెందుతున్నారు.  దీనివల్ల చెరువు కట్ట కింద ఉన్న గ్రామాలకు కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.