Video news : అనారోగ్యంపాలు చేస్తున్న క్రషర్ తొలగించాలంటూ గ్రామస్తుల ఆందోళన
క్రషర్ కాలుష్యం కారణంగా గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారని అనకాపల్లి మండలం వూడేరు గ్రామస్తులు ఎన్ఈసి క్రషర్ వద్ద ఆందోళనకు దిగారు.
క్రషర్ కాలుష్యం కారణంగా గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారని అనకాపల్లి మండలం వూడేరు గ్రామస్తులు ఎన్ఈసి క్రషర్ వద్ద ఆందోళనకు దిగారు. ఎన్ఈసి క్రషర్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా క్రషింగ్ చేయడంవల్ల గ్రామంలోని గాలీ, నీరు కాలుష్యమై గ్రామస్తులు కిడ్నీ రోగాలకు గురి అవుతున్నారని, క్వారీ పేలుళ్ల కారణంగా ఇల్లు బీటలువారి శిథిలావస్థకు చేరుకున్నాయని, కాలుష్యం కారణంగా పంటలు చేతికి అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం ఎన్ఈసీ క్రషర్ పై విచారణ జరిపి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.