మంత్రి వెల్లంపల్లి ఇంటిముందు టిడిపి కార్పోరేటర్ ఆందోళన

విజయవాడ: తనకు సమాచారమివ్వకుండానే తన డివిజన్లో అధికారిక కార్యక్రమం ఎలా నిర్వహిస్తారంటూ ఏకంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటిఎదుటే విజయవాడకు చెందిన కార్పోరేటర్ ఆందోళనకు దిగాడు. విజయవాడలోని వన్ టౌన్ లో మంత్రి వెల్లంపల్లి ఇంటి వద్ద టీడీపీ కార్పొరేటర్ చంటి తన అనుచరులు, టిడిపి కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టాడు. మంత్రి వెల్లంపల్లి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తాను కార్పోరేటర్ గా వున్న 52వ డివిజన్ లో అధికారికంగా పర్యటిస్తూ తనకు సమాచారం ఇవ్వలేదని చంటి ఆరోపించాడు. తన డివిజన్ పరిధిలోని లబ్దిదారులకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని తాను లేకుండానే జరిపారని అన్నాడు. డివిజన్ ప్రజలచేత ఎన్నికయిన తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడం ఏమిటంటూ మంత్రి నివాసం వద్ద నిరసనకు దిగిన కార్పోరేటర్ చంటి ఆవేదన వ్యక్తం చేసాడు. 
 
First Published Jan 2, 2022, 2:08 PM IST | Last Updated Jan 2, 2022, 2:08 PM IST