విజయవాడ జనసేన అధ్యక్షుడు మహేష్ అరెస్ట్ ప్రచారం... పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

విజయవాడ: పారిశ్రామికవేత్త సయ్యద్ అస్లాం మృతిపై పోలీసులు జరుపుతున్న విచారణపై జనసేన నాయకుడు పోతిన మహేష్ అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

First Published Mar 2, 2022, 12:03 PM IST | Last Updated Mar 2, 2022, 12:03 PM IST

విజయవాడ: పారిశ్రామికవేత్త సయ్యద్ అస్లాం మృతిపై పోలీసులు జరుపుతున్న విచారణపై జనసేన నాయకుడు పోతిన మహేష్ అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పైనా తీవ్ర ఆరోపణలు చేసారు. దీంతో అస్లాం మృతికి సంబంధించిన ఆధారాలుంటే సమర్పించాలని జనసేన నగర అధ్యక్షుడు పోతిన మహేష్ కు పోలీసుల నోటీసులు జారీ చేసారు. ఈ క్రమంలోనే మహేష్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మహేష్ కొత్తపేట పోలీస్ స్టేషన్ కు చేరుకోగా ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.