ఇంద్రకీలాద్రిపై పోలీసుల ఓవరాక్షన్ ... భక్తులతోనే కాదు అర్చకులతోనూ దురుసు ప్రవర్తన

విజయవాడ : దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులతోనే కాదు అమ్మవారిని పూజించే అర్చకులతో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. 

First Published Sep 28, 2022, 1:50 PM IST | Last Updated Sep 28, 2022, 1:50 PM IST

విజయవాడ : దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులతోనే కాదు అమ్మవారిని పూజించే అర్చకులతో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. నిత్యం అమ్మవారి సేవలో తరించే అర్చకులను సైతం ఆలయంలోకి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆలయ స్థానాచార్యులు, ప్రధానర్చకులను సైతం ఐడీ కార్డు చూపిస్తేనే ఆలయంలోకి అనుమతిస్తున్నారని... ఇక సాధారణ అర్చకులను డ్యూటీ కార్డు చూపించినా అడ్డుకుంటున్నారని వాపోతున్నారు. ఇలా ఇద్దరు అర్చకులను పోలీసులు అడ్డుకోవడంతో వారు వాగ్వాదానికి దిగారు. డ్యూటీ పాస్ చూపించినప్పటికీ అడ్డుకున్న పోలీసులు మీకు నచ్చింది చేసుకో అంటూ దురుసుగా మాట్లాడారని అర్చకులు తెలిపారు. అయితే పోలీసులు మాత్రం ఆలయ ఈవో ఆదేశాల మేరకే డ్యూటీ పాస్ వున్నవారినే అనుమతిస్తున్నామని చెబుతున్నారు. పోలీసుల ఓవరాక్షన్ పై ఆలయ అర్చకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.