దళితులపై అగ్రకులస్తుల దాడి.. తలలు పగలగొట్టి, బూతులు తిడుతూ..
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం గోసం గ్రామం యస్ సి మాదిగ కులస్తులు పై అదే గ్రామానికి చెందిన అగ్రకులపేతందార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం గోసం గ్రామం యస్ సి మాదిగ కులస్తులు పై అదే గ్రామానికి చెందిన అగ్రకులపేతందార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు. కులం పేరుతో దూషించి మీకు ఇక్కడ చంపేస్తే దిక్కుఎవడరా మా స్థలాలే కావలిరా మీకు, మా కిందబ్రతికిన వాళ్ళు మేం చెప్పినట్లు వినాలి అంటూ కొట్టారు. ఈ దాడిలో ఐదుగురికి తలలు పగిలాయి. మహిళలను బట్టలు విప్పించి మరీ కొట్టారు. దీనిపై తక్షణమే విచారణజరిపించాలని, నిందితులను అదుపులోకి తీసుకొని వారిపై sc/stనిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, జిల్లా ఎస్పీని గారుని జిల్లా దళిత సంఘాలు డిమాండ్ చేసాయి.