జనసేన ప్లెక్సీలు, కటౌట్లు చించేసిన దుండుగులు... పెనమలూరులో ఉద్రిక్తత
పెనమలూరు :జనసేన పార్టీ పదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ప్లెక్సిలను గుర్తుతెలియని వ్యక్తులు చించేసారు.
పెనమలూరు :జనసేన పార్టీ పదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ప్లెక్సిలను గుర్తుతెలియని వ్యక్తులు చించేసారు. వారాహి వాహనంలో వస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ కు స్వాగతం పలుకుతూ పెనమలూరు నియోజకవర్గం తాడిగడప జంక్షన్ లో స్థానిక నాయకులు భారీ కటౌట్లు ఏర్పాటుచేసారు. అయితే ఈ కటౌట్లు, ప్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇదిలావుంటే విజయవాడలోని ఆటోనగర్ నుండి ప్రచారరథం వారాహిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మచిలీపట్నం బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరి తాడిగడప, పోరంకి, పెనమలూరు, పామర్రు–గుడివాడ, గూడూరు సెంటర్ల మీదుగా వారాహి యాత్ర సాగి సాయంత్రం 5గంటలకు మచిలీపట్నంలోని పార్టీ ఆవిర్భావ సభా వేదికకు చేరుకోనుంది. ఇప్పటికే ఈ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.