చెట్టుకు వేలాడుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం.. అనుమానిస్తున్న పోలీసులు..
కృష్ణాజిల్లా నూజివీడులో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
కృష్ణాజిల్లా నూజివీడులో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పట్టణ పరిధిలోని ఎం. ఆర్. అప్పారావు కాలనీ వద్దనున్న గురుకుల పాఠశాల సమీపంలో లుంగీ, షర్టు ధరించిన ఓ 35 ఏళ్ళ వయసున్న వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. కాళ్ళు నేలను తాకుతుండడంతో అతని మృతి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ బి. శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.