తాడేపల్లిలో దారుణం... కృష్ణా నదిలో కొట్టుకువచ్చిన మృతదేహం
గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కృష్ణా నదిలో గుర్తుతెలియని మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. సీతానగరం పుష్కర ఘాట్ వద్ద మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.