U1 జోన్ బాధిత రైతుల ఎడ్లబండి ర్యాలీలో అపశృతి... రోడ్డుపైనే కుప్పకూలిన అన్నదాత
తాడేపల్లి: తమ గ్రామాల పరిధిలో వ్యవసాయ భూములను U1 రిజర్వ్ జోన్ చేర్చడాన్ని నిరసిస్తూ తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి రైతులు గతకొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే
తాడేపల్లి: తమ గ్రామాల పరిధిలో వ్యవసాయ భూములను U1 రిజర్వ్ జోన్ చేర్చడాన్ని నిరసిస్తూ తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి రైతులు గతకొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. U1 జోన్ ను ఎత్తివేయాలంటూ బాధిత రైతులు చేపట్టిన దీక్ష ఇవాళ్టితో 50 రోజులకు చేరుకుంది. దీంతో U1 జోన్ బాదిత రైతులు దేవస్థానం టు దీక్షా శిబిరం పేరుతో ఎడ్లబండితో నిరసన ర్యాలీ నిర్వహించారు. తీవ్ర ఎండలోనూ రైతులు ర్యాలీ చేపట్టడంతో ఓ అన్నదాత అస్వస్థతకు గురయ్యాడు. తోటి రైతులతో కలిసి నడుస్తుండగా ఒక్కసారిగా మహేశ్వర రెడ్డి సొమ్మసిల్లి రోడ్డుపైనే పడిపోయాడు. దీంతో తోటి రైతులు అతడిని నీడలోకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. ఈ రైతుకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని మిగతా రైతులు హెచ్చరించారు.