కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు

విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల శివారు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

First Published Mar 1, 2022, 7:01 PM IST | Last Updated Mar 1, 2022, 7:01 PM IST

విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల శివారు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పరిటాల బైపాస్ పై వేగంగా వెళుతున్న కారు అదపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ముందుకు దూసుకెళ్లిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న బాలుడుతో పాటు మరో వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందారు. వీరు కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఇక ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి సహా మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. గాయపడిన వారిలో మిస్టర్ కర్ణాటక బాడీ బిల్డర్ వున్నట్లు సమాచారం. కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.