ఏలూరులో దారుణం... అన్నదమ్ముల కుటుంబాల మధ్య అక్రమ సంబంధం చిచ్చు

ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే గ్రామంలో పాతకక్షల నేపథ్యంలో అన్నదమ్ముల కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. 

First Published May 9, 2022, 4:52 PM IST | Last Updated May 9, 2022, 4:52 PM IST

ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే గ్రామంలో పాతకక్షల నేపథ్యంలో అన్నదమ్ముల కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. తనతో పాటు భార్యపై అన్న కుటుంబం దాడికి పాల్పడినట్లు పామర్తి శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  గతంలో తమ కొడుకు భార్యతో బావ కొడుకు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని... అయితే విషయం బయటపడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని శ్రీనివాస రావు భార్య తెలిపింది. ఈ విషయంలో తమ కుటుంబాల మధ్య అప్పట్లో గొడవలు జరిగాయని... అయితే నష్టపరిహారంగా 15సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని అధికార వైసిపి నాయకుల ద్వారా ఒత్తిడి చేసారని తెలిపారు. ఇప్పుడు ఆ స్థలంలో రెవెన్యూ అధికారుల సహకారంతో తడికలు కడుతుంటే అడ్డుకున్నామని... దీంతో తమపై దాడికి పాల్పడ్డారని శ్రీనివాసరావు బార్య తెలిపింది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.